కదులుతున్న బస్సు.. హోటల్ రూమ్‌లో అఘాయిత్యాలు.. హైదరాబాద్‌లో రెచ్చిపోయిన కామాంధులు

కదులుతున్న బస్సు.. హోటల్ రూమ్‌.. దేన్ని వదలడం లేదు కామాంధులు. అదునుచూసి అబలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.

moving bus incident: ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ పరిధిలో వెలుగు చూసిన దారుణోంతాలు మహిళల భద్రత పట్ల భయాందోళన కలిగిస్తున్నాయి. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని గ్యాంగ్‌రేప్‌నకు గురైంది. మరో ఘటనలో కదులుతున్న బస్సులో మహిళపై కామాంధుడొకడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

యువతిపై గ్యాంగ్‌రేప్‌
వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన యువతి సోమవారం సాయంత్రం తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి ఓంకార్ నగర్‌లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్‌కి వెళ్లింది. ఇద్దరు మద్యం సేవించి హోటల్లో ఉన్న రూమ్‌కి వెళ్లారు. మత్తులో ఉన్న యువతిపై ఆమె స్నేహితుడు, మరొక యువకుడు లైంగిక దాడి చేసి పరారయ్యారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది.. అక్కడికి చేరుకున్నారు. ఐడీ ప్రూఫ్ ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని స్థానిక హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు. నిందితులు గౌతమ్ రెడ్డి, అతడి ఫ్రెండ్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: అడవిలో ఒంటరి మహిళ.. ఇనుప గొలుసుతో చెట్టుకు బంధించిన దుర్మార్గులు

కదులుతున్న బస్సులో మహిళపై అఘాయిత్యం
మరో ఘటనలో కదులుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఓ మహిళ(26) లైంగిక దాడికి గురైంది. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళుతున్న హరికృష్ణ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సులో డ్రైవర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. డయల్ 100కి సమాచారం రావడంతో స్పందించిన ఓయూ పోలీసులు తార్నాకలో బస్సును పట్టుకున్నారు. నిందితుడు డ్రైవర్ క్రిష్ణయ్య అప్పటికే పారిపోయినట్టు ఓయూ సీఐ రాజేందర్ తెలిపారు. అర్దరాత్రి సమయంలో డ్రైవర్ తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు భాదిత మహిళ ఫిర్యాదు చేసిందని.. మేడ్చల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించామని, మరో డ్రైవర్ సిద్దయ్యను విచారిస్తున్నామన్నారు.

Also Read: గంజాయితో యువతి జీవితాన్ని నాశనం చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి.. కిలాడీ దంపతులు

ట్రెండింగ్ వార్తలు