Woman Rapes Boy: కొడుకు వరుసయ్యే బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన ఎయిడ్స్ పీడితురాలు: కారణం తెలిస్తే షాక్ అవుతారు

ఓ మహిళ..తన కొడుకు వరుసయ్యే బాలుడిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని యుద్ధం సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది

Udham

Woman Rapes Boy: ఓ మహిళ..తన కొడుకు వరుసయ్యే బాలుడిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని యుద్ధం సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎయిడ్స్ పీడితురాలైన ఆ మహిళ కావాలనే బాలుడిపై ఈ దారుణానికి వొడిగట్టడం గమనార్హం. యుద్ధం సింగ్ నగర్ ఎస్ఐ రీటా చౌహాన్ తెలిపిన వివరాలు మేరకు..23 ఏళ్ల మహిళ గత కొంత కాలంగా ఎయిడ్స్ వ్యాధితో భాదపడుతుంది. ఇదే వ్యాధి సోకి ఆమె భర్త 2021 డిసెంబర్ లో మృతి చెందాడు. భర్త మృతి చెందడంతో ఆమె తమ స్వగ్రామం పిలిభిత్ చేరుకుంది. మృతి చెందిన బాధితుడి సోదరుడు మరొక గ్రామంలోఉంటున్నాడు. ఈక్రమంలో బాధితురాలికి భర్త మరణాంతర కార్యక్రమాలు నిర్వహించేందుకు భర్త సోదరుడి కొడుకు(15) పిలిభిత్ గ్రామానికి వచ్చాడు. అయితే ఎయిడ్స్ కారణంగా భర్తను కోల్పోయిన తాను కూడా ఎయిడ్స్ కి బలవుతున్నాని గ్రహించిన సదరు మహిళ..అదే సమయంలో తన భర్త సోదరుడి కుటుంబం సుఖసంతోషాలతో ఉంటున్నారని కక్ష పెంచుకుంది.

Also read:Gujarat : టాయిలెట్ కు వెళ్లిందని విద్యార్థిని వాతలు తేలేలా కొట్టిన టీచర్లకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

ఈక్రమంలో ఇంటికి వచ్చిన బాలుడిపై మహిళ పలుమార్లు అత్యాచారం చేసింది. ఈఘటన హోలీ పండుగ ముందు చోటుచేసుకుంది. అయితే అత్యాచార ఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆమహిళ బాలుడిని హెచ్చరించింది. దీంతో భయపడిన బాలుడు తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నా..అత్యాచార విషయాన్నీ బయటకు చెప్పలేదు. అయితే ఇటీవల సదరు మహిళ బాలుడిని చూసేందుకు గ్రామానికి వచ్చింది. తిరిగి బాలుడిపై అత్యాచారం చేయగా..విషయాన్నీ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాడు బాలుడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనకు వచ్చిన ఎయిడ్స్ వ్యాధిని బాలుడి ద్వారా కుటుంబంలోని మిగతా వారికీ అంటించాలనే దురుద్దేశంతోనే ఆ మహిళ ఈ అఘాత్యానికి వొడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:Amit Shah: నా వాయిస్ హై పిచ్ లో ఉంటుంది..తప్పుగా అనుకోవద్దు..అది మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ ..