×
Ad

young girl cheating 18 men : 18 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసిన యువతి అరెస్ట్

  • Published On : March 21, 2021 / 11:56 AM IST

Young Girl Cheating 18 Men

Telugu young girl cheating 18 men by the name of marriage : సమాజంలో మగవాళ్లకు పెళ్లిజరగటం ఆలస్యం అవటాన్ని, అవకాశంగా తీసుకుని ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుని, వారి వద్ద నగలు, నగదు కాజేసి మోసం చేస్తున్న తెలుగు యువతితోపాటు మరో ఐదుగురిని రాజస్ధాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన భాగ్వతి అలియాస్ అంజలి అనే యువతితోపాటు మరో ఐదుగురిని రాజస్ధాన్ పోలీసులు జూనాఘడ్ లో అరెస్ట్ చేశారు. ఈ ముఠా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, రాష్ట్రాల్లో పలువురు యువకులను పెళ్లి చేసుకుని, వారివద్దఉన్న నగలు, నగదు తీసుకుని పరారవుతూ మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

జూనాఘడ్ పరిధికి చెందిన అంబాలియాకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్నఅంజలి అతని ఇంట్లోని నగలు, రూ. 3లక్షల నగదుతో పరారయ్యింది. తాను మోసపోయినట్లు గుర్తించిన యువకుడు అంజలి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసునమోదు చేసుకున్న పోలీసులు అంజలి మారుపేరు గుర్తింపు పత్రాలతో గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని వలపన్ని అంజలి, ఆమె తల్లి ధనుబెన్ తోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. విచారణలో అంజలి 18 మందిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. యువకులను పెళ్లి చేసుకోవటం కొన్నాళ్లు వారితో ఉండి వారివద్ద ఉన్ననగలు, నగదు తీసుకుని ఈ ముఠా పరారయ్యేది.