Hyderabad Murder : హైదరాబాద్‌లో పట్టపగలే యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని పట్టపగలే దారుణంగా హత్య చేశారు. హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ సర్
- chvmurthy
- Published On : January 14, 2022 / 02:53 PM IST
Hyderabad murder
Hyderabad Murder : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని పట్టపగలే దారుణంగా హత్య చేశారు. హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ సర్ కట్ట వద్ద సోహైల్ ఖాద్రి(25) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
సోహైల్ చాంద్రాయణ గుట్టనుంచి హషీమాబాద్ వైపు కారులో వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డగించి… అతడిని బయటకు లాగి కత్తులతో నరికి చంపారు. బొలనగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న హుమాయూన్ నగర్ పోలీసులు&క్లూస్ టీమ్ వివరాలు సేకరించారు.
Also Read : Nun Rape Case : క్రైస్తవ సన్యాసిని రేప్ కేసులో బిషప్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.వ్యక్తి హత్యకు కారణాలు ? హత్య చేసింది ఎవరు? వివిధ కోణంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
