గుడ్ న్యూస్: ఎయిర్ ఇండియాలో 109 ఉద్యోగాలు

  • Publish Date - May 11, 2019 / 10:03 AM IST

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్యూటీ మేనేజర్ టెర్మినల్, కస్టమర్ ఏజెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకు రాత పరీక్ష లేదు. మే 13, 14 తేదీల్లో డైరెక్ట్ ఇంటర్వ్యూలు జరగుతాయి. ఆసక్తిగల విద్యార్ధులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 109 పోస్టులు ఉన్నాయి. అందులో కస్టమర్ ఏజెంట్ పోస్టులు 100, డ్యూటీ మేనేజర్ టెర్మినల్ పోస్టులు 9 ఉన్నాయి.

విద్యా అర్హతలు: 
కస్టమర్ ఏజెంట్ పోస్టుకు డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత విభాగాల్లో ఒక ఏడాది అనుభవం తప్పనిసరి. డ్యూటీ మేనేజర్-టెర్మినల్ పోస్టుకు డిగ్రీతో పాటు 16 ఏళ్ల అనుభవం ఉండాలి.

వయస్సు: 
డ్యూటీ మేనేజర్-టెర్మినల్ వయస్సు 55 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. కస్టమర్ ఏజెంట్ వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: 
ఆసక్తిగల అభ్యర్థులు సర్టిఫికెట్స్‌తో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500. ఈ అడ్రస్‌లో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

Systems & Training Division 2nd floor,
GSD Complex, Near Sahar Police Station,
Airport Gate No.-5, Sahar, Andheri-E,
Mumbai-400099.

ట్రెండింగ్ వార్తలు