AP School Summer Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు వచ్చేస్తున్నాయ్ .. ఇంకో 4 రోజులే ఉంది

AP School Summer Holidays 2026 : విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. వేసవి సెలవులు ప్రారంభం కావడానికి మరో 4 రోజులు మాత్రమే ఉంది.

andhra pradesh government announces summer holidays 2026 from april 24 to june 11

AP School Summer Holidays 2026 : 2025-26 విద్యా సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు మొదలు కాబోతున్నాయి. ఈ సారి విద్యార్థులకు సుమారు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్ 2 (SA-2) పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23, గురువారం పాఠశాలలకు చివరి పని దినం అని ఇప్పటికే విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌లో ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఆ తర్వాత జూన్ 12న 2026-27 విద్యా సంవత్సరం మొదలవుతుంది.

ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగిశాయి. ఇంటర్ ఫలితాలు వెల్లడించిన విద్యాశాఖ, మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు కూడా వెల్లడించాలని భావిస్తోంది. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఏప్రిల్ 23 వరకు సెకండ్ ఇయర్ తరగతులు కొనసాగుతాయి. అనంతరం ఏప్రిల్ 24 నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా వేసవి సెలవులు ఇస్తారు. అయితే జూన్‌ 1వ తేదీ నుంచే వీరికి కొత్త విద్యా సంవత్సరం తిరిగి ప్రారంభమవుతుంది. జూన్‌ 1 నుంచి ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్ తరగతులు రాష్ట్రవ్యాప్తంగా మొదలవుతాయి.

ఇక వేసవి సెలవుల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు:

  • సెలవుల్లో పిల్లలను సముద్రం, నదులు, సరస్సులు, చెరువులు, కుంటల వద్దకు ఒంటరిగా వెళ్లనివ్వవద్దని తెలిపారు.
  • ఈసారి ఎండలు తీవ్రంగా ఉండటంతో.. బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీళ్లు తాగేలా చూడాలని సూచించారు.
  • ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.
  • సెలవుల్లో విద్యార్థులు ఒంటరితనానికి గురికాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుకోవడం, కలిసి భోజనం చేసేలా చూడాలని సూచించారు.
  • సెలవుల్లో విద్యార్థులు.. టీవీలు, సెల్‌ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా తల్లిదండ్రులు వారిని నియంత్రించాలని సూచించారు.