AP EAPCET Results 2026 : ఏపీ విద్యార్థులకు అలర్ట్.. EAMCET రిజల్ట్స్ పై కీలక ప్రకటన.. ఎప్పుడంటే..!
AP EAPCET Results 2026 : ఏపీ ఎప్ సెట్ ఫలితాలపై కీలక ప్రకటన వెలువడింది.
- Dharani Pilli
- Updated on- May 18, 2026 / 06:30 PM IST
ap eapcet results 2026 date will release on june 1
AP EAPCET Results 2026 : తెలంగాణలో EAPCET ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల దృష్టి ఏపీ ఎప్‌సెట్ రిజల్ట్స్‌పై ఉంది. ఈ క్రమంలో ఫలితాల విడుదలపై కీలక ప్రకటన వెలువడింది. షెడ్యూల్ ప్రకారమే అంటూ జూన్ 1న ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12 నుంచి ఆరంభమైన ఎప్‌సెట్ బుధవారం (20వ తేదీ)తో ముగియనుంది. పరీక్షలు ముగిసిన తర్వాత మే 23న ప్రైమరీ కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత మే 25వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం షెడ్యూల్ ప్రకారమే జూన్ 1న తుది కీ, ర్యాంకులు ప్రకటించే అవకాశముందని APSCHE వర్గాలు పేర్కొన్నాయి. CBT విధానం అనుసరిస్తున్నందున నార్మలైజేషన్ అనంతరం రిజల్ట్స్ ఇస్తారు.
ఫలితాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఫలితాలు చెక్ చేసుకోవాలంటే.. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..
ఫలితాలు విడుదలయ్యాక, స్కోర్ కార్డ్, ర్యాంక్ కార్డును పొందడానికి ఇలా చేయాలి:
రిజల్ట్ చెక్ చేయాలంటే:
- ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ AP EAPCET APSCHEకు వెళ్లాలి.
- లాగిన్ వివరాలు నమోదు చేయాలి. అంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్/పేమెంట్ రెఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత “View Result” లేదా “Download Rank Card” పై క్లిక్ చేసి మీ స్కోర్, ర్యాంకును చూసుకోవచ్చు.
- భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోండి.
ముఖ్యమైన సమాచారం:
- పరీక్షల తేదీలు: ఇంజనీరింగ్ పరీక్షలు మే 12 నుండి 18 వరకు, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు మే 19, 20వ తేదీన జరుగుతాయి.
- ఫలితాల విడుదల తేదీ: జూన్ 1, 2026.
- కౌన్సెలింగ్: ఫలితాలు విడుదలైన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
