దరఖాస్తుకు 2 రోజులే గడువు : డీజిల్ లోకో మోడర్నైజేషన్ వర్క్స్ (DMW)లో అప్రెంటీస్ ఉద్యోగాలు

  • Publish Date - March 24, 2020 / 11:42 AM IST

రైల్వే అనుబంధ సంస్ధ అయిన డీజిల్ లోకో మోడర్నైజేషన్ వర్క్స్ (DMW)లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 182 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 26, 2020 తో ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

విభాగాల వారీగా ఖాళీలు : 
ఎలక్ట్రీషియన్ – 70
మెకానికల్ డీజిల్ – 40
మెషినిస్ట్ – 32
ఫిట్టర్ – 23
వెల్డర్ -17

విద్యార్హత : అభ్యర్దులు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగం ఐటీఐలో సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ.100 చెల్లించాలి. SC,ST,ఎక్స్ – సర్వీస్ మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్దులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 27, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 26, 2020.

Also Read | NACLO లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు