AP Electricity Jobs: విద్యుత్ శాఖలో 2,511 ఉద్యోగాలు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్, దరఖాస్తు, పూర్తి వివరాలు

AP Electricity Jobs: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.

AP Electricity Jobs: విద్యుత్ శాఖలో 2,511 ఉద్యోగాలు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్, దరఖాస్తు, పూర్తి వివరాలు

Notification for 2,511 job recruitments in AP Electricity Department soon

Updated On : August 17, 2025 / 2:53 PM IST

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,511 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వాటిలో జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1,711, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) 800 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో,డిస్కామ్‌లలో భర్తీ చేయనున్నారు.

ఇదే విషయాన్ని ఇటీవల విద్యుత్ శాఖా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే, ఒకేసారి పెద్ద మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. కాబట్టి, దశల వారీగా భర్తీ చేయాలని, వాటిలో సాధ్యమైనంత తొందరగా 2,511 ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన సూచించినట్టుగా సమాచారం. కాబట్టి, ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.