NEET PG Results: నీట్ 2025 పీజీ రిజల్ట్స్ అప్డేట్.. కటాఫ్ పర్సెంటైల్ ఎంతో తెలుసా?
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఇటీవల నీట్ పేజీ 2025(NEET PG Results) ఎగ్జామ్

NEET PG 2025 Exam Results to be released soon
NEET PG Results: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఇటీవల నీట్ పేజీ 2025(NEET PG Results) ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటినుండి అభ్యర్థులు తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తుది ఫలితాల గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ 2025 పరీక్ష ఫలితాలను అధికారులు త్వరలో విడుదల చేయబోతున్నారట. పరీక్షా రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in నుంచి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు:
నీట్ పేజీ 2025 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థులు కేటగిరీకి నిర్దేశించిన కటాఫ్ మార్కులు, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే, నీట్ పీజీ కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటే విడుదల చేస్తారు. కాకపోతే, వివిధ కేటగిరీలకు నిర్దేశించిన కటాఫ్ పర్సంటైల్‌ను ఎన్బీఈఎంఎస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లోనే పేర్కొంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
- ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ (ఎస్సీ / ఎస్టీ / ఓబీసీకి చెందిన పీడబ్ల్యూడీ సహా): 40వ పర్సంటైల్
- యూఆర్ పీడబ్ల్యూడీ: 45వ పర్సంటైల్
- జనరల్ / ఈడబ్ల్యూఎస్: 50వ పర్సంటైల్
తుది ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి ఆరు నెలల సమయంలోనే నీట్ పీజీ స్కోర్ కార్డులను ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. అభ్యర్థులు ఆరు నెలల లోపు తమ స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఏడాది నీట్ పీజీ పరీక్ష కోసం దాదాపు 2,42,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికోసం దేశవ్యాప్తంగా 301 నగరాల్లోని 1,052 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.