CUET UG 2026 : విద్యార్థులకు NTA కీలక అలర్ట్.. ఆ పరీక్ష వాయిదా.. కారణమిదే

CUET UG 2026 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు కీలక అలర్ట్ జారీ చేసింది.

Due to bakrid NTA postpone CUET UG 2026 examination scheduled for 28th of this month

CUET UG 2026 : పరీక్షల నిర్వహణలో వైఫల్యం, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వంటి పరిణామాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే నీట్ పరీక్షను రద్దు చేసిన NTA.. తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ‘కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌’ (సీయూఈటీ (CUET)) యూజీ 2026 పరీక్ష వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 28న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. తాజాగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. మే 28న రెండు షిఫ్ట్‌ల్లో ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. కానీ దాన్ని వాయిదా వేశారు.

సీయూఈటీ పరీక్ష వాయిదాకు కారణం ఏంటంటే.. బక్రీద్ సెలవు. బక్రీద్ సెలవు తేదీలో మార్పు చేస్తూ మే 22వ తేదీన కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బక్రీద్‌ పండగ సెలవు తేదీలో మార్పు కారణంగా.. DoPT జారీ చేసిన నోటిఫికేషన్ దృష్ట్యా సీయూఈటీ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌టీఏ పేర్కొంది. పరీక్ష కొత్త తేదీలను ఎన్‌టీఏ, సీయూఈటీ వెబ్‌సైట్‌ల ద్వారా తెలియజేస్తామని ఎన్‌టీఏ పేర్కొంది.

దేని కోసం ఈ పరీక్ష..

దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీలు సహా ప్రఖ్యాత వర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ప్రతి ఏటా ఈ సీయూఈటీ పరీక్షను నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మే 28న పరీక్ష నిర్వహించాల్సి ఉంది.

కొత్త షెడ్యూల్, పరీక్షా ప్రకటనలకు సంబంధించిన తాజా సమాచారం కోసం విద్యార్థులు అధికారిక NTA, CUET వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించింది. ఇతర సందేహాలకు అభ్యర్థులు 011-40759000 నంబర్‌లో NTA హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు లేదా cuet-ug@nta.ac.in కు ఈమెయిల్ చేయవచ్చు. ఇతర వివరాలకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.