AIIMS Mangalagiri Recruitment
AIIMS Mangalagiri Job Vacancies : ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 68 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న వాటిలో ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వంటి ఖాళీలు ఉన్నాయి. బయో కెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, యూరాలజీ, ఫిజియాలజీ, తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అర్హతల విషయానికి వస్తే ప్రొషెసర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్ లో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్ , డీఎం ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 14 ఏళ్ల అనుభవం అవసరం. అడిషనల్ ప్రొఫెసర్లకు సంబంధిత స్పెషలైజేషన్ లో ఎండీ, ఎంఎస్, ఎంసీహ్చ్ , డీఎం ఉత్తీర్ణ సాధించి ఉండాలి. 10 ఏళ్ల అనుభవం ఉండాలి. వయస్సు 58 ఏళ్లకు మించకూడదు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 50 ఏళ్లకు మించరాదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ లో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 50 ఏళ్లకు మించరాదు.
ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు . ఎంపికైన వారికి వేతనంగా 1,01500 నుండి 1,68,900 చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా ఫిబ్రవరి 15, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; aiimsmangalagiri.edu.in పరిశీలించగలరు.