UPSC Recruitment: UPSC రిక్రూట్మెంట్.. 84 పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

యూపీఎస్‌సీ(UPSC Recruitment) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా లెక్చరర్, ఇతర పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

UPSC Recruitment: UPSC రిక్రూట్మెంట్.. 84 పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

UPSC Recruitment: UPSC has released notification for 84 posts

Updated On : August 25, 2025 / 10:14 AM IST

UPSC Recruitment: నిరుద్యోగులకు యూపీఎస్‌సీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా లెక్చరర్, ఇతర పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 ఖాళీలు భర్తీ చేయనున్నారు. దీనికి(UPSC Recruitment) సంబందించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 11వరకు కొనసాగనుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి, అర్హతలు, అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా..

పోస్టులు, ఖాళీల వివరాలు:

  • అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు 19
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు 25

దరఖాస్తు రుసుము:
మహిళలు, SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. మిగిలిన వారు దరఖాస్తు ఫీజు కింద రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

దరఖాస్తు ఇలా చేసుకోండి:

ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లోకి వెళ్ళాలి.

తరువాత Recruitment/Advertisement విభాగంలోకి వెళ్ళాలి

అక్కడ ORA లింక్‌పై క్లిక్ చేయాలి

వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకుని, లాగిన్ అవ్వాలి.

పూర్తి వివరాలను ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.

దరఖాస్తు రుసుము చెల్లించాలి.

దరఖాస్తును సమర్పించి ప్రింట్ తీసుకోవాలి.