NFDB Recruitments
NFDB Recruitments : నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డ్ హైద్రబాద్ లో ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్నికల్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ , హిందీ,ఐటీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
READ ALSO : Tomato Cultivation : టమోటా సాగులో తెగుళ్లు , నివారణ పద్దతులు !
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
READ ALSO : Weekend farming : వీకెండ్ వ్యవసాయంపై సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఫోకస్..ఫాం హౌసుల్లో కడక్ నాథ్ కోళ్ల పెంపకం..
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ఎన్ఎఫ్డీబీ, ఫిఫ్ బిల్డింగ్, ఫిల్లర్ నెం.235, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే, ఎస్వీఎన్ పీఏ పోస్టు, హైదరాబాద్, దరఖాస్తు పంపేందుకు చివరితేదిగా 4 మే , 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nfdb.gov.in/ పరిశీలించగలరు.