TSSPDCL JOBS : తెలంగాణా విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ
పోస్టుల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 70 ఖాళీలు, సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 201 ఖాళీలు, జూనియర్ లైన్ మెన్ 1000 ఖాళీలు ఉన్నాయి.
- Guntupalli Ramakrishna
- Published On : May 9, 2022 / 07:37 PM IST
Tsspdcl
TSSPDCL JOBS : తెలంగాణ విద్యుత్ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1271 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, జూనియర్ లైన్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 70 ఖాళీలు, సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 201 ఖాళీలు, జూనియర్ లైన్ మెన్ 1000 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ నెల 11 నుంచి ప్రారంభం అవుతాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://tssouthernpower.cgg.gov.in/ పరిశీలించగలరు.
