IISC Recruitment : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జాబ్ ఓరియెంటెడ్ అప్టిట్యూడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు 21,700 నుండి 69000వరకు చెల్లిస్తారు.
- Guntupalli Ramakrishna
- Published On : December 20, 2022 / 11:36 AM IST
Indian Institute of Science Job Vacancies
IISC Recruitment : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) బెంగుళూరులో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 76 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జాబ్ ఓరియెంటెడ్ అప్టిట్యూడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు 21,700 నుండి 69000వరకు చెల్లిస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జనవరి 6, 2023 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://iisc.ac.in/ పరిశీలించగలరు.