Job Recruitment : గుంటూరు జిజిహెచ్ లో ఉద్యోగాల భర్తీ
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 15,000రూ నుండి 21,500రూ వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Updated on- March 27, 2022 / 03:23 PM IST
Ggh Guntur
Job Recruitment : ఆంధ్రపదేశ్ లోని గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి ఆప్టోమెట్రిస్ట్, రిఫ్రాక్షనిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, డార్క్ రూం అసిస్టెంట్, డయాలసిస్ టెన్నీషియన్, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులను భర్తీ చేస్తారు.
దరఖాస్తు చేసుకునే అబ్యర్ధుల వయోపరిమితి మార్చి 1,2022 నాటికి 18 సంవత్సరాల నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్వీడియట్, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు సంబంధిత పనిలో అనుభం కలిగి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి అకడమిక్ మెరిట్, అనుభం, రిజర్వేషన్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 15,000రూ నుండి 21,500రూ వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; సూపరింటెండెంట్ కార్యాలయం, జీజీహెచ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. పూర్తి చేసి దరఖాస్తులు పంపేందుకు మార్చి 31,2022 చివరి తేదీగా నిర్ణయించారు.
