Jobs : బెంగుళూరు బెల్ లో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష , ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

Jobs : బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల ఖాళీల వివరాలను పరిశీలిస్తే కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ , మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఆప్టిక్స్ తదితర విభాగాల్లో డిప్యూటీ మేనేజర్లు 6ఖాళీలు, సీనియర్ ఇంజినీర్లు 27ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష , ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేది ఏప్రిల్ 18, 2022గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; మేనేజర్ , భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్), జలహళ్లి, బెంగళూరు-560013 సంప్రదించగలరు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.bel-india.in/సంప్రదించగలరు.

ట్రెండింగ్ వార్తలు