downloading admit cards
CAT 2023 Admit Card : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) లక్నో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ CAT 2023 యొక్క అడ్మిట్ కార్డ్‌లను ఈరోజు వెబ్‌సైట్ లో ఉంచనున్నారు. వాస్తవానికి అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ అక్టోబర్ 25గా గతంలో ప్రకటించినప్పటికీ దానిని నవంబర్‌కు వాయిదా వేశారు. CAT అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవటానికి అభ్యర్థులు యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది. iimcat.ac.in అనే వెబ్ సైట్ నుండి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
READ ALSO : Sagar : జనసేనలోకి ‘మొగలిరేకులు’ సీరియల్ నటుడు.. పోటీ చేస్తున్నారా..?
నవంబర్ 26, 2023న ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే తేదిని ప్రకటించారు. అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అభ్యర్థులు దానిలో పొందుపరిచిన వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. పరీక్ష రోజు మార్గదర్శకాలు, పేపర్ టైమింగ్స్ , ఏసమయానికి పరీక్షాం కేంద్రంలో రిపోర్టింగ్ చేయాలి అన్న వివరాలను జాగ్రత్తగా చదవాలి. హాల్ టికెట్ పై ఉన్న ఫోటోగ్రాఫ్, సంతకం, పేరు,ఇతర వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయోలేదు చూసుకోవాలి. ఏదైనా పొరపాటు జరిగితే, వెంటనే పరీక్ష నిర్వహణ అధికారి దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది.
CAT అడ్మిట్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్టేజ్ 1: iimcat.ac.in అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
స్టేజ్ 2: అది ఓపెన్ అయ్యాక హోమ్‌పేజీపై కనిపించే CAT 2023 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టేజ్ 3: అనంతరం కొత్త విండో ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి మీ లాగిన్ కీ ఎంటర్ చేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది.
స్టేజ్ 4: వెంటనే మీ CAT హాల్ టికెట్ 2023 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టేజ్ 5: ఇ-అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు డౌన్ లోడ్ అప్షన్ పై క్లిక్ చేయాలి. దానిని ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.
READ ALSO : Drunk school teacher : పీకలదాకా మద్యం తాగి తరగతి గదిలో నిద్రపోయిన టీచర్…ఆపై ఏం జరిగిందంటే…
CAT 2023 హాల్ టిక్కెట్‌పై అభ్యర్థికి సంబంధించిన పూర్తి పేరు, ఫోటోగ్రాఫ్, సంతకం , రిజిస్ట్రేషన్ నంబర్ వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. పరీక్షా కేంద్రంలో అభ్యర్థి గుర్తింపును ధృవీకరించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అభ్యర్థులు తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డుల ప్రింట్‌అవుట్‌ని తీసుకుని, పరీక్ష రోజున పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
CAT 2023 పరీక్షా విధానం ;
సాధారణ ప్రవేశ పరీక్ష మూడు విభాగాలుగా నిర్వహించనున్నారు.
1. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (VARC) – 34 ప్రశ్నలు.
2. డేటా ఇంటర్‌ప్రిటేషన్ మరియు లాజికల్ రీజనింగ్ (DILR) – 32 ప్రశ్నలు.
3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (QA) – 34 ప్రశ్నలు.
ఒక్కో విభాగానికి 60 నిమిషాల వ్యవధి కేటాయిస్తారు. CAT పరీక్ష 2023కి సంబంధించిన పూర్తిస్ధాయి సమాచారం, ఇతర వివరాల కోసం, అభ్యర్థులు CAT 2023 అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in పరిశీలించగలరు.