Sagar : జనసేనలోకి ‘మొగలిరేకులు’ సీరియల్ నటుడు.. పోటీ చేస్తున్నారా..?

'మొగలిరేకులు' సీరియల్ నటుడు సాగర్.. జనసేనలో జాయిన్ అయ్యారు. గోదావరిఖని రామగుండం ప్రాంతానికి చెందిన సాగర్..

Sagar : జనసేనలోకి ‘మొగలిరేకులు’ సీరియల్ నటుడు.. పోటీ చేస్తున్నారా..?

Telugu Serial Actor Sagar joined in Pawan Kalyan Jansena

Sagar – RK Naidu : టాలీవుడ్ నటుడు ‘సాగర్’ అంటే పెద్దగా గుర్తుకు పట్టకపోవచ్చు గాని.. మొగలి రేకులు సీరియల్ ‘ఆర్కే నాయుడు’ అంటే ఇట్టే కనిపెట్టేస్తున్నారు. తెలుగు సూపర్ హిట్ సీరియల్స్ ‘చక్రవాకం’, ‘మొగలి రేకులు’ సీరియల్స్ తో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న సాగర్.. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిన సాగర్.. 2016లో ‘సిద్దార్థ’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.

ఆ తరువాత కూడా హీరోగా రెండు సినిమాల్లో నటించారు. చివరిగా 2021లో ‘షాదీ ముబారక్’ అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మంచి విజయానే అందుకుంది. కానీ సాగర్ ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. అయితే ఈ ఏడాది మొదటిలో పవన్ కళ్యాణ్ తో కలిసి సాగర్ భేటీ అయిన ఫోటోలు బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యాయి. దీంతో సాగర్ జనసేనలో జాయిన్ అవుతున్నారా..? అనే ప్రశ్నలు వినిపించాయి.

తాజాగా ఈ నటుడు ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. గోదావరిఖని రామగుండం ప్రాంతానికి చెందిన సాగర్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయబోతున్నారా..? అనే సందేహం నెలకుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త లక్కినేని సుందర్ రావు, ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగాబాబు కూడా జనసేన పార్టీలో చేరారు.