LIC Recruitment :
LIC Recruitment : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఉండాలి. అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. దీని తర్వాత అభ్యర్థి ప్రధాన పరీక్షకు హాజరు కావాలి. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థికి రూ.53, 600 వేతనం ఇవ్వబడుతుంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 31, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://licindia.in పరిశీలించగలరు.