NABARD Vacant Posts : నాబార్డ్‌లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ ఖాళీ పోస్టులు భర్తీ
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 177 పోస్టులను భర్తీ చేస్తోంది.
- bheemraj
- Published On : September 10, 2022 / 07:03 PM IST
NABARD Vacant Posts
NABARD Vacant Posts : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 177 పోస్టులను భర్తీ చేస్తోంది. వీటిలో డెవలప్‌మెంట్ అసిస్టెంట్, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టులు ఉన్నాయి.
డీగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. మొత్తం 177 పోస్టులకు గానూ ఇందులో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ 173 (జనరల్ 80, ఎస్సీ 21, ఎస్టీ 11, ఓబీసీ 46, ఈడబ్ల్యూఎస్ 15), డెవలప్‌మెంట్ అసిస్టెంట్ హిందీ 4 చొప్పున పోస్టులు ఉన్నాయి. 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.
Anganwadi Posts Recruitment : అనంతపురం జిల్లాలో అంగన్ వాడీ వర్కర్, హెల్పర్ పోస్టుల భర్తీ
హిందీ సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై 21 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 15 అప్లికేషన్లు ప్రారంభమవుతాయి. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 10. వెబ్‌సైట్: www.nabard.org
