NEET UG 2026 Guidelines : నీట్ పరీక్షకు వెళ్లే విద్యార్థులకు అలర్ట్.. ఈ రూల్స్ పాటించకపోతే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించరు.. జాగ్రత్త
NEET UG 2026 Guidelines : నీట్ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. NTA గైడ్ లైన్స్ విడుదల చేసింది.
- Dharani Pilli
- Updated on- April 20, 2026 / 05:07 PM IST
neet ug 2026 nta guidelines to reminds candidates on dress code and electronic devices check details
NEET UG 2026 Guidelines : ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో MBBS, BDS, BSMS, BUMS, BHMS కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు గాను నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు సమయం దగ్గర పడుతోంది. మే 3న దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. లక్షల సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. ఇప్పటికే NTA సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. త్వరలోనే అడ్మిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. డ్రెస్ కోడ్‌కు సంబంధించి కీలక సూచనలు చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వీటిని తప్పనిసరిగా పాటించాలి.
పరీక్షకు వచ్చేటప్పుడు ఇవి తప్పనిసరి
నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష రోజున అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తమతో పాటు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే డ్రెస్ కోడ్ పాటించడం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద నష్టాలను కలిగిస్తాయని.. అలాంటి తప్పులు చేయవద్దని NTA ‘ఎక్స్’ వేదికగా కీలక సూచనలు చేసింది. అవేంటంటే..
అభ్యర్థులు పాటించాల్సిన మార్గదర్శకాలు
- పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు గంట ముందే చేరుకోవాలి.
- ప్రతి ఒక్కరూ ఎగ్జామినేషన్ గైడ్‌లైన్స్ తప్పకుండా పాటించాలి.
- నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు చెల్లుబాటయ్యే ఒరిజినల్ ఐడీ తప్పనిసరిగా తమతో పాటు తీసుకెళ్లాలి. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- పెన్నుతో మాత్రమే ఓఎంఆర్ షీట్‌ను జాగ్రత్తగా నింపాలి. కొట్టివేతలు, కరెక్షన్ ఫ్లూయిడ్ వినియోగించకూడదు.
డ్రెస్ కోడ్
- నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలి.
- పొడవు చేతులున్న దుస్తులు, మందంగా ఉన్న బట్టలు ధరించకూడదు.
- శరీరం మీద ఎలాంటి మెటల్ నగలు ఉండకూడదు. మీతో పాటు ఎలాంటి వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- వాచ్, సెల్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- ఏదైనా సంప్రదాయ వస్తువులు ఏవైనా ధరించాల్సి వస్తే.. ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌లో ఒక గంట ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
వీటిని తీసుకెళ్లకూడదు
- నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు తమతో పాటు జామెట్రీ, పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, కాలిక్యులేటర్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్, ఎరేజర్, కాలిక్యులేటర్ లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ స్కానర్ వంటి వస్తువులను తీసుకెళ్లకూడదు.
- మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్, హెల్త్ బ్యాండ్ కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు.
- వాలెట్, బెల్ట్, క్యాప్ వంటివి ధరించకూడదు.
