NEET UG Counseling 2025: నీట్ యూజీ కౌన్సెలింగ్ అప్డేట్.. రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు ఇవాళే.. ఒక్క క్లిక్ తో మీ రిజల్ట్ ఈజీగా చెక్ చేసుకోండి

NEET UG Counseling 2025: నీట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ రౌండ్ 1 కౌన్సెలింగ్ ఫలితాలు ఇవాళ(ఆగస్టు 11) న విడుదల కానున్నాయి.

NEET UG Round 1 Counselling Results Released Today

నీట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అండర్ గ్రాడ్యుయేట్ (UG) రౌండ్ 1 కౌన్సెలింగ్ ఫలితాలు ఇవాళ(ఆగస్టు 11) న విడుదల కానున్నాయి. నిజానికి ఈ ఫలితాలు ఆగస్టు 9న వెలువడాల్సి ఉంది. కానీ, ఎంసీసీ ఛాయిస్ ఫిల్లింగ్ విండోను ఆగస్టు 9 రాత్రి 11:59 గంటల వరకు పొడిగించింది. ఇక ఫలితాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లోకి వెళ్లి తమ ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు. అయితే, సీట్ల కేటాయింపు ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ కింది దశలు ఫాలో అవ్వండి.

మీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి:

అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లోకి వెళ్ళాలి.

హోమ్ పేజీలో నీట్ యూజీ రౌండ్ 1 సీట్ల కేటాయింపు లింక్ పై క్లిక్ చేయాలి.

మీ క్రెడెన్షియల్స్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాలి.

స్క్రీన్ పై మీ ఫలితాలు డిస్ప్లే అవుతాయి.

దానిని డౌన్లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోవాలి.