Recruitment of job vacancies in Cargo Logistics and Allied Services Company Limited
AAI Recruitment : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్(సీఎల్‌ఏఎస్)లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ 2019, 2020, 2021/ ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1 పరీక్ష అర్హత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు.
అభ్యర్థులను స్క్రూటినీ, ప్రిలిమినరీ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 15,000 స్టైపెండ్‌గా అందిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 14 జనవరి 2023 తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aaiclas.aero/career పరిశీలించగలరు.