Ecil Recruitment : ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అర్హతలు కలిగిన వారు నవంబర్‌ 13, 14 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.25,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు.

Recruitment of job vacancies in Electronics Corporation of India Limited

Ecil Recruitment : భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 70 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలి-కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

అర్హతలు కలిగిన వారు నవంబర్‌ 13, 14 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.25,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇంటర్వ్యూకి హాజరుకావాల్సిన చిరునామా ; చిరునామా: ఫ్యాక్టరీ మెయిన్ గేట్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ECIL పోస్ట్, హైదరాబాద్ – 500062. ఎంపికైన వారు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ecil.co.in/jobs.html పరిశీలించగలరు.