ESIC Faridabad Recruitment : ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఫరీదాబాద్‌లో పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియాలో నమోదై ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.

Recruitment of posts in Employees State Insurance Corporation Faridabad

ESIC Faridabad Recruitment : భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఫరీదాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 77 సీనియర్‌ రెసిడెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. యూరాలజీ, ఆంకాలజీ, మైక్రోబయాలజీ, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఫార్మకాలజీ, క్యాజువాలిటీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియాలో నమోదై ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధులు నేరుగా సంబంధిత డాక్యుమెంట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలో మెరిట్‌, విద్యార్హతలు ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 2023, ఏప్రిల్‌ 26వ తేదీన ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల నుంచి రూ.1,27,141 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇంటర్వ్యూ చిరునామా : ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పటల్‌, ఎన్‌హెచ్‌-3, ఎన్‌ఐటీ, ఫరిదాబాద్‌.