SVIMS Recruitment : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో పోస్టుల భర్తీ

అభ్యర్థుల వయసు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 67,700 నుంచి రూ. 2,11,300 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Sri Venkateswara Institute of Medical Sciences

SVIMS Recruitment : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 142 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.

జనరల్‌ సర్జరీ, అనాటమీ, క్లినికల్‌ వైరాలజీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సైకియాట్రీ, యూరాలజీ, రేడియాలజీ, పెడియాట్రిక్స్‌, రోమటాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభ‌వం ఉండాలి.

అభ్యర్థుల వయసు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 67,700 నుంచి రూ. 2,11,300 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులను పంపాల్సిన చిరునామా; రిజిస్ట్రార్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,అలిపిరి రోడ్, తిరుపతి, తిరుపతి జిల్లా..517 502. దరఖాస్తుల స్వీకరణకు మే 08వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.svimstpt.ap.nic.in/