University of Hyderabad Recruitment
UOHYD Recruitment : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 2 రిసెర్చ్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Bitter Gourd Cultivation : పందిరి కాకర సాగుతో.. అధిక లాభాలు పొందుతున్ననెల్లూరు జిల్లా రైతు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్లకు మించరాదు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన వారికి నెలకు 20,000 వేతనంగా చెల్లిస్తారు.
READ ALSO : Green Leafy Vegetables : వేసవిలో ఆకుకూరలకు మంచి డిమాండ్.. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు
అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ది డీన్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, దరఖాస్తులకు చివరి తేదిగా ఏప్రిల్ 22, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://uohyd.ac.in/. పరిశీలించగలరు.