Yantra India Limited Trade Apprentice Recruitment 2023
Yantra India Limited : భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,395 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. విభాగాల వారిగా ఖాళీలను పరిశీలిస్తే ఐటీఐకు సంబంధించి3508 ఖాళీలు, నాన్ ఐటీఐకు సంబంధించి 1887 ఖాళీలు ఉన్నాయి.
మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి. ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నాన్-ఐటీఐ కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
READ ALSO : Heart Attack : మీ కళ్లేదుటే ఎవరైనా గుండె పోటుకు గురై చలనం లేకుండా పడిఉంటే తక్షణం ఏమి చేయాలంటే ?
నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.అభ్యర్ధల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. నెలకు స్టైఫెండ్ గా నాన్-ఐటీఐలకు రూ.6000, ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.
అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 28, 2023తో ముగుస్తుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://www.yantraindia.co.in/ పరిశీలించగలరు.