Replacement : ఐఐఎం విశాఖలో టీచింగ్ పోస్టుల భర్తీ
అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత సంబ్జెక్టుల్లో పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీచింగ్ లో అనుభవం కగలిగి ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : March 25, 2022 / 10:25 AM IST
Iim Visakhapatnam
Replacement : విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లో స్పెషల్ రిక్రూట్ మెంట్ ద్వారా టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. డిసిషన్ సైన్సెస్, అంత్రప్రెన్యూర్ షిప్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, పబ్లిక్ పాలసీ, స్ట్రాటజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత సంబ్జెక్టుల్లో పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీచింగ్ లో అనుభవం కగలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్ట్, సెమినార్ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ మెయిల్, ఆఫ్ లైన్ ద్వారా పంపవచ్చు. ఈ మెయిల్ దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 14,2022గా నిర్ణయించారు. హార్డ్ కాపీ దరఖాస్తులను అందించేందుకు ఏప్రిల్ 21, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.iimv.ac.in/సంప్రదించగలరు.
