స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు

  • Publish Date - August 29, 2019 / 05:11 AM IST

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (JHT), సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (SHT), హిందీ ప్రధ్యాపక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2) డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఖాళీలు: 
పోస్టుల సంఖ్యను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తర్వాత వెల్లడిస్తుంది.

విద్యార్హత: 
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, సర్టిఫికెట్, డిప్లొమా ఉత్తీర్ణత. 

వయసు: 
అభ్యర్ధులు 2020, జనవరి 1 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: 
జనరల్, OBC అభ్యర్ధులు రూ. 100 చెల్లించాలి. SC, ST అభ్యర్ధులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

Read Also.. దరఖాస్తు చేసుకోండి: మెట్రో రైలు కంపెనీలో ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు:  
 దరఖాస్తు ప్రారంభం : ఆగస్ట్ 27, 2019.

దరఖాస్తు చివరితేది : సెప్టెంబర్ 26, 2019.

 చలానా రూపంలో ఫీజు చెల్లించాలంటే : సెప్టెంబర్ 30, 2019.

 పరీక్ష తేది (పేపర్ 1) : నవంబర్ 26, 2019.

 పేపర్ 2 పరీక్ష తేది : ప్రకటించాల్సి ఉంటుంది.