Indian Railway Jobs: పది పాసైనవారికి బంపర్ ఆఫర్.. రైల్వేలో 3115 ఉద్యోగాలు.. ఫీజు, దరఖాస్తు, పూర్తి వివరాలు
Indian Railway Jobs; రైల్వేలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ఇండియన్ రైల్వే నుంచి ఇటీవల జాబ్ నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే.

Notification released for 3115 apprentice jobs in Indian Railways
రైల్వేలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ఇండియన్ రైల్వే నుంచి ఇటీవల జాబ్ నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 3115 ఈస్ట్ రైల్వే అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే మొదలవగా సెప్టెంబర్ 13వ తేదీ వరకు కొనసాగనుంది. కాబట్టి, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ rrcer.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 15 ఏళ్ళ నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఎలాంటి రుసుము ఉండదు.