SVNIRTAR Recruitment : స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

SVNIRTR Job Vacancies

SVNIRTAR Recruitment : ఒరిస్సా కటక్‌లోని స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో 77 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Strength And Stamina For Men : 50 ఏళ్లు పైబడిన పురుషులకు బలం, సత్తువ కోసం ఉత్తమ ఆహారాలు !

భర్తీ చేయనున్న పోస్టుల్లో డైరెక్టర్ పోస్టులు 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీఎంఆర్‌) పోస్టులు 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పీచ్) పోస్టులు 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్ సైకాలజీ) పోస్టులు 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులు 4, లెక్చరర్ ఫిజియోథెరపీ పోస్టులు 4, లెక్చరర్ ఆక్యుపేషనల్ థెరపీ పోస్టులు 3, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు 4, రిహాబిలిటేషన్, ఆఫీసర్‌ పోస్టులు 4, ప్రోస్టెటిస్ట్ అండ్‌ ఆర్థోటిస్ట్ పోస్టులు 15, అసిస్టెంట్ పోస్టులు 4, క్లినికల్ అసిస్టెంట్ (స్పీచ్ థెరపిస్ట్) పోస్టులు 3, క్లినికల్ అసిస్టెంట్ (డెవలప్‌మెంటల్ థెరపిస్ట్) పోస్టులు 3, అకౌంటెంట్ పోస్టులు 3, స్పెషల్ ఎడ్యుకేటర్స్ / ఒ అండ్‌ ఎం ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు 7, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు 3, వర్క్‌షాప్ సూపర్‌వైజర్ పోస్టులు 4, క్లర్క్, టైపిస్ట్ పోస్టులు 3 ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

READ ALSO : Lower Blood Pressure : రక్తపోటును తగ్గించడంలో సహాయపడే రోజువారీ పానీయాలు ఇవే ?

రాత పరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు జూన్‌ 7, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.800లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://svnirtar.nic.in/ పరిశీలించగలరు.