TS Gurukul Sainik School : తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్, ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు!

విద్యార్ధుల ఎంపిక రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది. ఎంపికైన విద్యార్ధులకు గురుకులం విధానంలో స్కూల్ , కాలేజ్ విద్యతో పాటుగా ఎన్ డిఎ, ఎస్ ఎస్ బీ, పరీక్షలలో అర్హత సాధించేలా శిక్షణ ఇస్తారు. ఇందుకు గాను 6వ తరగతికి 5వ తరగతి చదువుచున్న వారు, ఇంటర్ కి 10వ తరగతి చదువుచున్న వారు అర్హులు.

TS Gurukul Sainik School : మిలిటరీ ఎడ్యుకేషన్‌, త్రివిధ దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక బాలుర పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా విద్యాభాసన కొనసాగుతుంది.

ఇందుకు గాను తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2028-24 విద్యా సంవత్సరానికి ఆరోతరగతి(80 సీట్లు)ఇంటర్‌మీడియట్‌(ఎంపీసీ- 80 సీట్లు) ప్రవేశాలకు గాను అర్హులైన బాలుర నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

విద్యార్ధుల ఎంపిక రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది. ఎంపికైన విద్యార్ధులకు గురుకులం విధానంలో స్కూల్ , కాలేజ్ విద్యతో పాటుగా ఎన్ డిఎ, ఎస్ ఎస్ బీ, పరీక్షలలో అర్హత సాధించేలా శిక్షణ ఇస్తారు. ఇందుకు గాను 6వ తరగతికి 5వ తరగతి చదువుచున్న వారు, ఇంటర్ కి 10వ తరగతి చదువుచున్న వారు అర్హులు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఫిబ్రవరి 20న ఉంటుంది. ఆసక్తి గల బాలురు www. tswreis. ac. in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు