Inter Results 2026 : ఇంటర్ ఫలితాల విడుదలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్ డే ఎప్పుడంటే..

Inter Results 2026 : ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇంతకు రిజల్ట్ విడుదలయ్యేది ఎప్పుడంటే..

telangana inter results 2026 for first and second year will expected in april tsbie cgg gov in

Inter Results 2026 : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకనం ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే రిజల్ట్స్ ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుంది అంటున్నారు. ఇప్పటికే ఇంటర్ విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 10, 2026 నాటికి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

పరీక్షల వివరాలు:

  • ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరిగాయి.
  • ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 17, 2026 వరకు జరిగాయి.
  • సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 26 నుండి మార్చి 18, 2026 వరకు నిర్వహించారు.
  • ఈ ఏడాది సుమారు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారని అధికారులు ప్రకటించారు. వీరిలో 4 లక్షల మంది ప్రథమ సంవత్సరం, 5 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?

ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ఈ కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  • బోర్డు అధికారిక వెబ్‌సైట్ http://tgbie.cgg.gov.in ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత హోమ్ పేజీకి వెళ్లి ‘Inter Results 2026’ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ క్లాస్ (1st Year లేదా 2nd Year) ఎంచుకోవాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి.
  • ‘Submit’ బటన్ నొక్కగానే మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.

రిజల్ట్ చెక్ చేసుకోవాలంటే.. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని.. ఫలితాల వెల్లడికి సంబంధించి తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూస్తూ ఉండాలని బోర్డు సూచించింది.