TS EAPCET 2024 : తెలంగాణ ఎంసెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష తేదీలు ఇవే, ఎలా అప్లయ్ చేసుకోవాలంటే?
TS EAPCET 2024 : తెలంగాణ ఎంసెట్ 2024 పరీక్ష కోసం ఈ రోజు (ఫిబ్రవరి 26) నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పరీక్ష తేదీ, ఫీజు చెల్లించడం వంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
![TS EAPCET 2024 : తెలంగాణ ఎంసెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష తేదీలు ఇవే, ఎలా అప్లయ్ చేసుకోవాలంటే? TS EAPCET 2024 : తెలంగాణ ఎంసెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష తేదీలు ఇవే, ఎలా అప్లయ్ చేసుకోవాలంటే?](https://10tv.in/wp-content/uploads/2024/02/TS-EAMCET-2024-registration-starts-today_-Check-exam-dates-other-details.jpg)
TS EAMCET 2024 registration starts today: Check exam dates, other details
TS EAPCET 2024 : తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2024 కోసం దరఖాస్తు ప్రక్రియ ఈరోజు (ఫిబ్రవరి 26) నుంచి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్, అనుబంధ ప్రొఫెషనల్ కాలేజీలలో 2024-25 విద్యా సంవత్సరానికి అందించే అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం కోసం టీఎస్ ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక (eapcet.tsche.ac.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఏప్రిల్ 6, 2024 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తులో ఏదైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 12 వరకు అనుమతి ఉంటుంది. టీఎస్ ఎంసెట్ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మే 1, 2024న అందుబాటులో ఉంటుంది.
టీఎస్ ఎంసెట్ 2024 దరఖాస్తు ఫీజు :
ఈ సంవత్సరం తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET)ని తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET)గా మార్చిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం.. ఇంజినీరింగ్ పరీక్షకు హాజరయ్యే SC/ST అభ్యర్థులు తప్పనిసరిగా రూ.500, ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష కోసం, SC/ST అభ్యర్థులు తప్పనిసరిగా రూ.500, ఇతరులు (జనరల్) రూ.900 చెల్లించాలి. రెండు కోర్సులకు హాజరయ్యే SC/ST వర్గానికి చెందిన అభ్యర్థులు రూ.1000, ఇతరులు రూ.1800 చెల్లించాలి.
ఎంసెట్ పరీక్ష తేదీలు ఇవే :
టీఎస్ ఎంసెట్ 2024ని (TSCHE) తరపున హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ నిర్వహిస్తుంది. (TS EAPCET-2024) పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) మోడ్‌లో 3 గంటల పాటు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ పరీక్షకు పరీక్ష తేదీ మే 9, మే 10 తేదీల్లో నిర్వహిస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ పేపర్లకు పరీక్ష మే 11, మే 12 తేదీల్లో జరుగుతుంది. ఇంజినీరింగ్ పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ పేపర్ల పరీక్షలను మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
టీఎస్ ఎంసెట్ 2024 : రిజిస్ట్రేషన్ ముఖ్యమైన తేదీలు :
- ఫిబ్రవరి 26 నుంచి ఎంసెంట్ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం
- ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : ఏప్రిల్ 6
- టీఎస్ ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తు సవరణ – ఏప్రిల్ 8 నుంచి 12 ఏప్రిల్ వరకు
- రూ. 250 ఆలస్య రుసుముతో ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 9.
- రూ. 500 ఆలస్య రుసుముతో ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 14.
- రూ. 2,500 ఆలస్య రుసుముతో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 19 ఏప్రిల్ 2024.
- రూ. 5,000 ఆలస్య రుసుముతో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 4 మే 2024.
టీఎస్ ఎంసెట్ 2024 కోసం దరఖాస్తు ఎలా చేయాలి? :
- అధికారిక (eapcet.tsche.ac.in) వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, లాగిన్ ద్వారా మీ అకౌంట్ యాక్సెస్ చేయండి.
- హోమ్‌పేజీలో దరఖాస్తు ఫారమ్‌ను నింపిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
- మీ పూర్తి వివరాలను దరఖాస్తుల నింపిన తర్వాత అప్లికేషన్ సమర్పించండి
- చివరిగా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
టీఎస్ ఎంసెట్ 2024 : అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ :
ఎంసెట్ అభ్యర్థులు మే 1న eapcet అధికారిక వెబ్సైట్ నుంచి నుంచి హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Also : UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..