UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

UPSC

యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,056 పోర్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి మార్చి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరుగుతుంది. అందులో అర్హతపొందిన వారు మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 19న రాయాల్సి ఉంటుంది.

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌‌లో 150 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఇందుకు కూడా నోటిఫికేషన్‌ను విడుదలైంది. జనరల్ అభ్యర్థుల వయసు 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.

Hero Mavrick 440 Launch : మూడు వేరియంట్లలో కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ వచ్చేసింది.. ధర ఎంత? డెలివరీలు ఎప్పటినుంచంటే?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు..

అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫాంలో అభ్యర్థులు వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత పరీక్ష కోసం ఆన్‌లైన్ అప్లికేషన్‌లో వివరాలు ఇవ్వాలి. చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే ఓటీఆర్ పూర్తి చేసుకున్నారు. వాటిలో సవరణలకూ అవకాశం ఉంది.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటిని ఉపసంహరించుకోవడానికి వీలు ఉండదు. దరఖాస్తు ఫాం నింపేటప్పుడు ఏదైనా ఓ ఐడీ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 5. ఆ రోజున సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్ష తేదీకి ముందు ఈ-అడ్మిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఈ-అడ్మిట్ కార్డ్ UPSC వెబ్‌సైట్ https://upsconline.nic.in నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి.

పూర్తి వివరాలు ఇవిగో..

ఇక్కడ క్లిక్ చేయండి