Hero Mavrick 440 Launch : మూడు వేరియంట్లలో కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ వచ్చేసింది.. ధర ఎంత? డెలివరీలు ఎప్పటినుంచంటే?

Hero Mavrick 440 Launch : కొత్త హీరో మావ్రిక్ 440 హార్లే-డేవిడ్‌సన్‌తో కలిసి అభివృద్ధి చేసింది. కొత్త హీరో మావ్రిక్ 440 డెలివరీలు ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభం కానున్నాయి.

Hero Mavrick 440 Launch : మూడు వేరియంట్లలో కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ వచ్చేసింది.. ధర ఎంత? డెలివరీలు ఎప్పటినుంచంటే?

Hero Mavrick 440 launched at Rs 1.99 lakh

Hero Mavrick 440 Launch : ప్రముఖ టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కొత్త హీరో మావ్రిక్ 440 లాంచ్‌ను ప్రకటించింది. కొత్త మావ్రిక్ బేస్, మిడ్, టాప్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వరుసగా ధరలు రూ. 1.99 లక్షలు, రూ. 2.14 లక్షలు, రూ. 2.24 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని హీరో డీలర్‌షిప్‌ని విజిట్ చేయడం ద్వారా బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ‘వెల్‌కమ్ టు మావ్రిక్ క్లబ్ ఆఫర్’ని కూడా లాంచ్ చేసినట్టు ప్రకటించింది.

మార్చి 15 లోపు బైక్‌ను బుక్ చేసుకునే కస్టమర్‌లకు అందుబాటులో ఉంటుంది. వారికి కస్టమైజ్ చేసిన మావ్రిక్ కిట్ యాక్సెసరీస్, రూ. 10వేల విలువైన వస్తువులను పొందవచ్చు. కొత్త హీరో మావ్రిక్ 440 డెలివరీలు ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. రూ. 10వేల విలువైన అప్లియన్సెస్, కస్టమైజ్డ్ మావ్రిక్ కిట్‌ను పొందవచ్చు.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 సేల్ మళ్లీ మొదలైందోచ్.. ఈ స్టోర్లలో భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

కొత్త హీరో మావ్రిక్ 440 హార్లే-డేవిడ్‌సన్‌తో కలిసి డెవలప్ చేసింది. హీరో ఎక్స్440 ఆధారంగా రూపొందించింది. డిజైన్ పరంగా చూస్తే.. బైక్ హెచ్-ఆకారపు డీఆర్ఎల్‌లతో రౌండ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. ఇంధన ట్యాంక్, ఎక్స్‌టెండెడ్ ష్రౌడ్స్‌తో స్టైలింగ్‌ను పొందుతుంది. వెనుక వైపున ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లతో టెయిల్ సెక్షన్‌ను పొందుతుంది. స్కూప్-అవుట్, సింగిల్-పీస్ సీట్ సెటప్‌ను కూడా కలిగి ఉంది.

మావ్రిక్ బైక్ బ్యాక్ సైడ్ 7-దశల ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో 43ఎమ్ఎమ్ డయా టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను పొందుతుంది. రెండు చివర్లలో 17-అంగుళాల వీల్స్ కలిగి ఉంది. 13.5 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో 187కేజీ (అల్లాయ్ వీల్స్), 191కేజీ (స్పోక్ వీల్స్) వద్ద స్కేల్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ 2100ఎమ్ఎమ్ పొడవు, 175ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్, 803ఎమ్ఎమ్ సీటు ఎత్తుతో 1388ఎమ్ఎమ్ వీల్‌బేస్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ 320ఎమ్ఎమ్, బ్యాక్ సైడ్ 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.

Hero Mavrick 440 launched at Rs 1.99 lakh

Hero Mavrick 440 launched at Rs 1.99 lakh

5 కలర్ ఆప్షన్లు, 3 వేరియంట్లు :
ఈ బైక్ ఐదు కలర్ ఆప్షన్లతో పాటు బేస్, మిడ్ టాప్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో బేస్ వేరియంట్ స్పోక్ వీల్స్‌ను కలిగి ఉంది. సింగిల్ ఆర్కిటిక్ వైట్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. మిడ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. సెలెస్టియల్ బ్లూ, ఫియర్‌లెస్ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. టాప్ వేరియంట్ మెషిన్డ్ అల్లాయ్‌లను పొందుతుంది. ఫాంటమ్ బ్లాక్, ఎనిగ్మా బ్లాక్ కలర్ ఆప్షన్‌లతో అందిస్తోంది.

ఫీచర్ల పరంగా చూస్తే.. :
బైక్ అన్ని ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్‌లు, యూఎస్‌బీ-సి ఛార్జింగ్ పోర్ట్ , స్లిప్పర్ క్లచ్‌ని పొందుతుంది. హార్లే-డేవిడ్‌సన్ ఎక్స్440కి పవర్ అందించే అదే 440సీసీ ఇంజిన్ కలిగి ఉంది. ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ కలిగిన ఈ బైక్ ఇంజన్ 6000ఆర్పీఎమ్ వద్ద 27బీహెచ్‌పీ, 4000ఆర్బీఎమ్ వద్ద 36ఎన్ఎమ్ శక్తిని రిలీజ్ చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Read Also : Tata Motors EV Price Cut : భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!