Tata Motors EV Price Cut : భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

Tata Motors First EV Price Cut : కొత్త ఎలక్ట్రానిక్ కారు కొంటున్నారా? టాటా మోటార్స్ ఈవీ కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. దాంతో మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ధరలు 8శాతం వరకు తగ్గాయి. దేశంలోనే ఈవీ కార్ల ధరలను తగ్గించిన మొదటి కంపెనీగా టాటా నిలిచింది.

Tata Motors EV Price Cut : భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

Tata Motors Announces First EV Price Cuts in India

Tata Motors First EV Price Cut : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ప్రముఖ భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) యూనిట్లలో కార్ల ధరలను భారీగా తగ్గించింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ కార్ల వాహనాలపై రూ. 1.20 లక్షల వరకు (1,450 డాలర్లు) తగ్గించింది. దేశంలో ఈవీ కార్ల ధరలను తగ్గించిన మొదటి ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది.

Read Also : Maruti Suzuki Flying Cars : మారుతీ సుజుకీ నుంచి గాల్లో ఎగిరే కార్లు..? ఈ మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లతో ట్రాఫిక్ కష్టాలు తప్పినట్టే!

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వేరియంట్‌లు కార్ల విక్రయాలలో కేవలం 2శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. తక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా కొనుగోలుదారులు అధిక ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇటీవలి కాలంలో బ్యాటరీ సెల్ ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భవిష్యత్తులో వాటి తగ్గింపును పరిగణనలోకి తీసుకుని ఫలితంగా వచ్చే ప్రయోజనాలను నేరుగా కస్టమర్‌లకు అందించాలని నిర్ణయించినట్టు టాటా ప్యాసింజర్‌ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స అన్నారు.

టాటా కంపెనీ ఈవీ కార్ల ధరలను తగ్గించిన తర్వాత ఎలక్ట్రిక్ మొబిలిటీలో అత్యధికంగా అమ్ముడవుతున్న నెక్సాన్.ఈవీ మోడల్ ధర ఇప్పుడు 1.4శాతం తగ్గి రూ.14లక్షల యాభై వేలకు చేరుకుంది. టాటా వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ధరలు గతంలో రూ.14లక్షల డెబ్భై వేల వద్ద ప్రారంభమయ్యాయి. భారత మార్కెట్లో ఈవీ కార్ల విక్రయాలలో ఆధిపత్యం చెలాయించే కంపెనీగా ఉన్నప్పటికీ.. ఎలక్ట్రిక్ చిన్న కారు టియాగో ధరను కూడా రూ.70వేలకు తగ్గించింది. ఇందులో బేస్ వెర్షన్ ఇప్పుడు 8.1శాతం తక్కువ ధరతో రూ.7లక్షల 99వేలకు కొనుగోలు చేయొచ్చు.

Tata Motors Announces First EV Price Cuts in India

Tata Motors First EV Price Cuts in India

మందగించిన ఈవీ అమ్మకాలు :
2024లో టాటా పంచ్ ఈవీ (ధర రూ. 12లక్షలు) లాంచ్ చేయనంత వరకు.. భారత మార్కెట్లో 2020 నెక్సాన్.ఈవీ ఎలక్ట్రానిక్ మోడల్.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్‌గా ఉంది. చైనా బీవైడీ వంటి ప్రత్యర్థుల కన్నా అమ్మకాల ఆధిక్యాన్ని కొనసాగించేందుకు అమెరికా కార్ల తయారీ సంస్థ టెస్లా ధరలు తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈవీ అమ్మకాలు మందగించాయి. భారత్‌లో టాటా కార్ల ధర తగ్గింపుతో ఇతర పోటీదారులు కూడా తమ కార్లను తక్కువ ధరలకు కొత్త ఈవీలను లాంచ్ చేయడానికి ప్రేరేపిస్తుందని ఎలారా క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ జే కాలే అన్నారు.

25శాతం ఈవీ అమ్మకాలే లక్ష్యం :
గత ఏడాది సెప్టెంబర్‌లో ఈవీ-ఓన్లీ డీలర్‌షిప్‌లను ప్రారంభించిన టాటా కంపెనీ.. రాబోయే మూడు నుంచి నాలుగు ఏళ్లలో 10 ఎలక్ట్రిక్ కార్లను తన పోర్ట్‌ఫోలియోలో చేర్చాలని యోచిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 9.3శాతం నుంచి 2025 నాటికి మొత్తం కార్ల విక్రయాలలో 25శాతానికి ఈవీ అమ్మకాలను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే మహీంద్రా, ఎంజీ మోటార్ వంటి వాటితో పోటీ పడుతున్న టాటా మోటార్స్ షేర్లు ఈ ప్రకటన తర్వాత 1.9శాతం వరకు పడిపోయాయి.

Read Also : Gemini AI Virtual Assistant : ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘డిఫాల్ట్ వర్చువల్ అసిస్టెంట్’గా జెమిని ఏఐ మోడల్.. ఇదేలా వాడాలంటే?