Maruti Suzuki Flying Cars : మారుతీ సుజుకీ నుంచి గాల్లో ఎగిరే కార్లు..? ఈ మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లతో ట్రాఫిక్ కష్టాలు తప్పినట్టే!
Maruti Suzuki Flying Cars : మారుతీ సుజుకీ నుంచి త్వరలో గాల్లో ఎగిరే కార్లు రాబోతున్నాయి. పేరంట్ కంపెనీ (సుజుకీ)తో కలిసి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లను ఈ కార్లను అభివృద్ధి చేయనుంది. జపాన్, అమెరికా తర్వాత భారత్‌లోనూ విస్తరించాలని యోచిస్తోంది.

Maruti Suzuki flying cars soon_ Company to develop Electric Air Copters with parent company
Maruti Suzuki Flying Cars : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ నుంచి భారత మార్కెట్లోకి ఎగిరే కార్లు రానున్నాయి. పేరంట్ కంపెనీ అయిన సుజుకీతో కలిసి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్ల అభివృద్ధిలోకి మారుతీ అడుగుపెట్టింది. నివేదిక ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌కాప్టర్లు డ్రోన్‌ల కన్నా చాలా పెద్దవిగా ఉంటాయి. కానీ, సాంప్రదాయ హెలికాప్టర్‌ల కన్నా చిన్నవిగా ఉంటాయి.
పైలట్‌తో సహా కనీసం మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ మినీ ఎయిర్ కాప్టర్లలో ప్రయాణించవచ్చు. భారత్‌కు విస్తరించే ముందు జపాన్, అమెరికాలో ఈ కొత్త మొబిలిటీ సొల్యూషన్‌లను ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వస్తే రవాణాలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానుంది. మారుతి కేవలం అమ్మకాల కోసం మాత్రమే భారత మార్కెట్‌పై దృష్టి పెట్టడం కాకుండా ఖర్చులను తగ్గించుకోవడానికి స్థానిక తయారీని కూడా పరిశీలిస్తోంది.

Maruti Suzuki Electric Air Copters
భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే? :
ఈ విజన్‌ని రియాలిటీగా మార్చేందుకు ఏవియేషన్ రెగ్యులేటర్ (DGCA)తో మారుతి సుజుకీ చర్చలు జరుగుతున్నాయని సుజుకీ మోటార్ అసిస్టెంట్ మేనేజర్ కెంటో ఒగురా వెల్లడించారు. రాబోయే మారుతీ ఎగిరే కార్లను ‘స్కైడ్రైవ్’ పేరుతో ఆవిష్కరించనున్నారు. జపాన్‌లో 2025 ఒసాకా ఎక్స్‌పోలో మారుతీ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లను విడుదల చేయాలని భావిస్తున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ టెక్నాలజీని చివరికి భారత్‌కు విస్తరించాలని మారుతి భావిస్తోంది.

Maruti Suzuki flying cars
ఎగిరే కార్లకు దేశంలోని వినియోగదారుల నుంచి ఎలాంటి రెస్పాండ్ ఉంటుంది? కస్టమర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదానిపై అంచనా వేస్తోంది. ఇందుకోసం పార్టనర్లను కూడా గుర్తించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో మార్కెట్ పరిశోధనను నిర్వహిస్తోంది. దేశ మార్కెట్లో ఎయిర్ కాప్టర్లు విజయవంతం కావాలంటే.. కస్టమర్లను ఆకట్టుకునేలా సరసమైన ధరలోనే ఉండాలని ఒగురా అభిప్రాయపడ్డారు.
హెలికాప్టర్‌కు ఎయిర్ కాప్టర్లకు మధ్య తేడా ఏంటి? :
టేకాఫ్ సమయంలో 1.4 టన్నుల బరువున్న ఎయిర్ కాప్టర్.. సంప్రదాయ హెలికాప్టర్‌లో దాదాపు సగం బరువు ఉంటుంది. ఈ తేలికైన బరువు కలిగిన ఎయిర్‌కాఫ్టర్ చాలా సులభంగా భవనాలపై నుంచి టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేందుకు వీలుంటుంది. విద్యుదీకరణ కారణంగా విమాన విడిభాగాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, దీని వల్ల తయారీ, నిర్వహణ ఖర్చులు తగ్గాయని నివేదిక పేర్కొంది.

Maruti Suzuki flying cars soon
ఏయే నగరాల్లోకి రావొచ్చుంటే? :
చూడటానికి మినీ హెలికాప్టర్ మాదిరిగా ఉండే ఈ మారుతీ ఎలక్ట్రిక్ ఎయిర్‌కాప్టర్లు సాధారణ హెలికాప్టర్ బరువులో సగం ఉంటుంది. భవనాల పైభాగంలో సులభంగా ల్యాండ్ చేసే విధంగా ఈ మినీ ఎయిర్‌కాప్టర్లను డిజైన్ చేయడం జరిగింది. పార్కింగ్ సమస్య కూడా ఉండకపోవచ్చు. దేశంలోకి ఈ ఎయిర్ కాప్టర్లు అడుగుపెట్టిన తర్వాత ముందుగా కొన్ని ప్రధాన నగరాల్లో ఎక్కువగా వినియోగంలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
అంతేకాదు.. ఇతర నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణె, కోల్‌కతా, ఢిల్లీ వంటి ప్రధాన మహానగరాల్లో మొదటి దశలో ఈ ఎయిర్ కాప్టర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అదేగానీ జరిగితే భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టినట్టే అవుతుంది. ఎలాంటి ట్రాఫిక్ రద్దీ లేకుండా నిర్దేశిత గమ్యానికి తొందరగా చేరుకోవడానికి వీలుపడనుంది.