AP CSPG Recruitment : ఆంధ్రప్రదేశ్ లోని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌ అండ్‌ గవర్నెన్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ/ సీఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ సంబంధిత స్పెషలైజేషన్‌లో లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

AP CSPG Recruitment :

AP CSPG Recruitment : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌ అండ్‌ గవర్నెన్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, అనలిస్ట్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ/ సీఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ సంబంధిత స్పెషలైజేషన్‌లో లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఇంటర్వూ నిర్వహిస్తారు. ఇంటర్వూకి ఎంపికైన వారి వివరాలు జనవరి 27న ప్రకటిస్తారు.

ఎంపికై వారికి ఏడాదికి రూ.5.4 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు జనవరి 17, 2023వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. తుది మెరిట్‌లిస్ట్ ఫిబ్రవరి 17న విడుదలవుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.apsdps.ap.gov.in/ పరిశీలించగలరు.