Jobs : మెదక్ డిఎంహెచ్ఓలో ఖాళీల భర్తీ.. దరఖాస్తుకు రేపటితో ముగియనున్న గడువు
పోస్టుల విషయానికి వస్తే మెడికల్ ఆఫీసర్లు మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
- Guntupalli Ramakrishna
- Published On : March 22, 2022 / 10:52 AM IST
Medak Dmho
Jobs : తెలంగాణా రాష్ట్ర పరిధిలోని మెదక్ జిల్లా వైద్యఆరోగ్యశాఖలో పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. పల్లె దవాఖానాల్లో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఖాళీలన్నీ ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
పోస్టుల విషయానికి వస్తే మెడికల్ ఆఫీసర్లు మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; డీఎంహెచ్ఓ, మెదక్ జిల్లా, తెలంగాణా అనే చిరునామాకు పంపాలి. దరఖాస్తులు పంపేందుకు చివరి తేది మార్చి 23, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : https://medak.telangana.gov.in/సంప్రదించగలరు.
