CGG Hyderabad Recruitment : తెలంగాణాలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో పలు పోస్టుల భర్తీ

కోర్ జావా, జే2ఈఈ, సర్వ్‌లెట్స్‌, జేఎస్‌పీ, జావాస్క్రిప్ట్‌, ఓఓపీఎస్‌, స్ట్రట్స్ ఫ్రేమ్‌వర్క్‌పై అవగాహన ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

CGG Hyderabad Recruitment : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జావా-సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ/ఎంఎస్‌, కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/బీసీఏ/ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.

కోర్ జావా, జే2ఈఈ, సర్వ్‌లెట్స్‌, జేఎస్‌పీ, జావాస్క్రిప్ట్‌, ఓఓపీఎస్‌, స్ట్రట్స్ ఫ్రేమ్‌వర్క్‌పై అవగాహన ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.cgg.gov.in/career/walk-java-software-developer/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు