Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీకి దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేశారా? వైరల్ అవుతున్న లేఖ
మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ లేఖ వైరల్‌గా మారడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
- tony bekkal
- Published On : October 15, 2023 / 05:35 PM IST
Digvijaya Singh: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా? సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో దీనికి సంబంధించిన లేఖ వైరల్ అవుతోంది. దీంతో అనేక మందికి ఈ అనుమానం కలుగుతోంది. అయితే, రాజీనామా అంశాన్ని దిగ్విజయ్ సింగ్ పూర్తిగా తోసిపుచ్చారు. తాను పార్టీకి రాజీనామా చేయలేదని, ప్రత్యర్థి పార్టీలు తప్పులు లేఖలు సృష్టించాయని ఆయన అన్నారు.
‘కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాకు సంబంధించి’ అనే అంశానికి సంబంధించి దిగ్విజయ్ సింగ్ రాసినట్టు ఉన్న లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దిగ్విజయ్ సింగ్ ఈ లేఖను ఫేక్ అని స్పష్టం చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని కూడా తెలిపారు. ‘‘అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నేతలు నిపుణులు. నేను 1971లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాను. నేను కాంగ్రెస్‌లో చేరింది పదవి కోసం కాదు, సిద్ధాంతాల ప్రభావంతో చేరాను. నా చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటాను. ఈ అబద్ధానికి వ్యతిరేకంగా నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను’’ అని అన్నారు.
भाजपा @BJP4India झूठ बोलने में माहिर है। मैंने १९७१ में कांग्रेस की सदस्यता ली थी। पद के लिए नहीं बल्कि विचारधारा से प्रभावित हो कर जुड़ा था और जीवन की आख़िरी साँस तक कांग्रेस में रहूँगा।
इस झूठ की मैं पुलिस में शिकायत दर्ज कर रहा हूँ। @INCIndia @DGP_MP pic.twitter.com/X1AjVQBXvb— digvijaya singh (@digvijaya_28) October 15, 2023
మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ లేఖ వైరల్‌గా మారడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
