×
Ad

Beyond Borders : రక్షణ రంగంలో సేవలందించే సంస్థలకు 10టీవీ విశిష్ట గౌరవం.. కాఫీ టేబుల్ బుక్

Beyond Borders : 10టీవీ ‘బియాండ్ బోర్డర్ సెక్యూరింగ్ ది వరల్డ్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఆదివారం ఉదయం 11గంటలకు ప్రసారం కానుంది.

Beyond Borders

10tv Beyond Borders Securing The world Program : భారత రక్షణ, అంతరిక్ష పరిశోధనా రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ.. తిరుగులేని స్వదేశీ ఆయుధాల తయారీలో భాగస్వాములుగా ఎనలేని సేవలందిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థలకు 10టీవీ యాజమాన్యం విశిష్ట గౌరవాన్ని అందిస్తూ.. అవార్డులను ప్రధానం చేసింది. 10టీవీ ‘బియాండ్ బోర్డర్ సెక్యూరింగ్ ది వరల్డ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పలువురు రాజకీయ రంగ ప్రముఖులు, రక్షణ రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రక్షణ, అంతరిక్ష పరిశోధనా రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రముఖ సంస్థలకు వారు అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం 10టీవీలో ఆదివారం ఉదయం 11గంటలకు ప్రసారం కానుంది.