BOM Notification: Bank of Maharashtra has released a notification for the posts of General Officer.
BOM Notification: బ్యాంకింగ్ రంగంలో లైఫ్ సెట్ చేసుకుందాం అనుకునేవారికి బంపర్ ఆఫర్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జాబ్ నోటిఫికేషన్(BOM Notification) విడుదల చేసింది. సంస్థలో ఖాలీగా ఉన్న మొత్తం 500 జనరల్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 30 వరకు కొనసాగనుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bankofmaharashtra.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
విద్యార్హత,అనుభవం:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. SC/ST/OBC/PwBD వారికి 55% మార్కులు ఉంటే సరిపోతుంది. చార్టర్డ్ అకౌంటెంట్ (CA), CMA, CFA, ICWA, JAIIB, CAIIB లలో డిగ్రీ పొందినవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులో కనీసం 3 సంవత్సరాలు పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థి వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ.1,180, SC/ST/PwBD అభ్యర్థులు రూ.118 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఈ పోస్టుల కోసం అభ్యర్థులను రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వేతన వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 64,820 నుంచి రూ.93,960 జీతం లభిస్తుంది. అదనంగా DA, HRA, CCA, వైద్య సౌకర్యాలు కూడా అందుతాయి.