×
Ad

అల్లుడు.. లెట్స్ డు కుమ్ముడు.. ట్రంప్ అల్లుడు తక్కువోడేం కాదు.. పెద్ద డీలే సెట్ చేశాడు.. !

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందమే ఈ వారం హాట్‌టాపిక్ అని అందరికి తెలిసిందే. అయితే చాలామందికి ఆశ్చర్యం కలిగించిన ఈ పరిణామం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి ఉందని భావించారు. కానీ అసలు కథ వేరే ఉంది. ఈ సంక్లిష్టమైన చర్చల వెనుక ఒక తెరచాటు మాస్టర్‌మైండ్ ఉన్నాడు. అతనెవరో కాదు, ట్రంప్ అల్లుడు, సలహాదారు జేర్డ్ కుష్నర్.