ఎలుకలు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. ఇంట్లో ఒక్క ఎలుక తిరుగుతోందంటేనే మనకు నిద్ర పట్టదు. అదే రెండు మూడు ఉంటే.. అర్జంటుగా వాటిని పట్టుకోవడమో, మందు పెట్టి మట్టుపెట్టడమో చేస్తుంటాం. అదే వందలు, వేల సంఖ్యలో ఎలుకలు ఉంటే... అమ్మో.. ఆ బీభత్సాన్ని ఊహించలేము. చారిత్రక పూరీ ఆలయంలో ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చింది. ఆలయంలో ఎలుకలు సృష్టిస్తున్న అల్లకల్లోలంతో అంతా హడలిపోతున్నారు. భక్తులు, పూజారులే కాదు.. ఎలుకలతో భగవంతుడికీ ముప్పు పొంచి ఉందని భయపడిపోతున్నారు.