Gold Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
Gold Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త.. గోల్డ్ రేటు తగ్గింది.
- Harish Thanniru
- Published on- July 11, 2026 / 10:19 PM IST
Gold Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.
10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ. 490 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,121 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,480 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,45,090కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,33,000 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది.
